
మొగలిపువ్వు శివ పూజకు పనికి రాదని చెబుతారు? దానికి కారణమేంటంటే మొగలిపువ్వుకు శివుడు అలా శాపం ఇచ్చాడట. అందుకే ఏ శివాలయంలోనూ పొరపాటున కూడా మొగలిపువ్వును పూజకు వినియోగించరు. దీనికి కారణమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ, శ్రీమహా విష్ణువు ఒకరోజు తాను గొప్పంటే తాను గొప్పంటూ వాదనకు దిగారట. అప్పుడు శివుడు వారి మధ్య లింగరూపంలో ప్రత్యక్షమై.. తన శిరస్సు ఎక్కడుందో వెదికి తీసుకుురమ్మని బ్రహ్మకు.. తన పాదాలు తీసుకుని రమ్మని విష్ణుమూర్తికి చెప్పి పంపించాడు.
ఇద్దరూ వెళ్లి ముల్లోకాల్లో వెదికారు. కానీ వారికి శివుడి తల, పాదాలు మాత్రం దొరకలేదు. విష్ణుమూర్తి వచ్చి శివుడికి తనకు పాదాలు దొరకలేదని చెప్పాడు. బ్రహ్మ దేవుడు మాత్రం ఎలాగైనా సరే గెలవాలనుకుని తన వెంట ఒక ఆవును, మొగలిపువ్వును తీసుకువచ్చి తాను లింగం తల చూశానని చెప్పి మొగలిపువ్వుతో కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు మాత్రం తాను చూడలేదని తన తోకను అడ్డంగా ఊపుతూ చెప్పిందట. అప్పుడు అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వును శ్రీ మహావిష్ణువు శపించాడట. నీవు పూజకు పనికిరావంటూ శాపమిచ్చాడట. కామధేనువు తన తోకతో నిజం చెప్పింది కాబట్టి ఇక మీదట ‘నీ వెనుక భాగాన్ని పూజిస్తాం’ అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి మొగలిపువ్వును పొరపాటున కూడా పూజలో వినియోగించరు.
