దుర్వాసుడిపైకి సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది?

దూర్వాస మహార్షి అక్కడికి విచ్చేశాడు. ఆయనను కూడా తన ఆతిథ్యం స్వీకరించమని అంబరీషుడు కోరగా కాళింది నదిలో స్నానం చేసి వస్తానని వెళతాడు. నదీ స్నానమాచరిస్తూనే ధ్యానంలోకి వెళ్లిపోయాడట. ఎంతకీ దుర్వాస మహర్షి రావడం లేదు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే కానీ వ్రత ఫలం దక్కదు. అప్పుడు పండితులను అంబరీషుడు పరిష్కారం కోరతాడు. దుర్వాసుడు భుజించకుండా తాను భుజితే అతను ఆగ్రహంతో శపిస్తాడు. భుజించకుంటే తాను ఇంత సేపు ఆచరించిన వ్రత ఫలితం దక్కదు సరికదా.. విష్ణుమూర్తి కృప కూడా తనకు దక్కదు. బ్రహ్మణ శాపం కంటే విష్ణువు అనుగ్రహమే తనకు ముఖ్యమని ద్వాదశ ఘడియలలో శుద్ధ జలాన్ని స్వీకరించినా దీక్ష ముగిసినట్టే అవుతుంది పైగా అతిథిని గౌరవించినట్టువుతుందని అంబరీషుడు అనుకుంటాడు. ఒకవేళ తాను అంత చేసినా దుర్వాసుడు శపిస్తే పూర్వజన్మ ఫలంగా భావించి భరిస్తానని అనుకుంటాడు.

మనసులో విష్ణుమూర్తిని ధ్యానించి జలాన్ని స్వీకరించి ముని రాక కోసం ఎదురు చూస్తుంటాడు. నదీస్నానం ముగించుకుని వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టితో రాజు చేసింది మహాపరాధంగా భావించి తన జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. దీంతో భయపడిన అంబరీషుడు శ్రీ మహా విష్ణువును శరణు కోరాడు. అప్పుడు శ్రీహరి రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు. ఆ సుదర్శన చక్రం కృత్యను ఖండించడమే కాకుండా దుర్వాసుని వెంబడించింది. అప్పుడు దుర్వాసుడు తనను రక్షించమని బ్రహ్మను వేడుకున్నాడు. దుర్వాసుడిని రక్షించడం తన వల్ల కాదని.. విష్ణుమూర్తికే సాధ్యమని బ్రహ్మ చెబుతాడు. అప్పుడు శ్రీహరిని దుర్వాసుడు తనను రక్షించమని వేడుకొనగా అంబరీషుడు మాత్రమే రక్షించగడని చెబుతాడు. అప్పుడు అంబరీషుడిని దుర్వాసుడు వేడుకున్నాడు. అప్పుడు అంబరీషుడు శ్రీహరిని ప్రార్థించడంతో సుదర్శన చక్రం తిరిగి విష్ణు సన్నిధికి చేరిందట.

Share this post with your friends