మహా శివుడికి దక్షుడు ఎందుకు శాపం ఇవ్వాల్సి వచ్చింది?

మహా శివుడిని దక్షుడు ఎందుకు శపించాల్సి వచ్చింది? అసలేం జరిగింది? అంటే.. శివుడికి దక్షుడు సాక్ష్యాత్తు పిల్లనిచ్చిన మామ. ఆయకు కూతురు సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే దక్షుడికి ఉన్న అల్లుళ్లలో శివుడు తప్ప మిగిలిన వారంతా మంచి సంపన్నులు. శివుడిని చూస్తేనేమో.. శ్మశానంలో తిరుగుతూ విబూదిని ధరించి పామును మెడలో వేసుకుని సంపన్నుడు కాదు సరికదా.. పిచ్చివాడి మాదిరిగా తిరుగుతూ ఉండేవాడు. దీంతో మహా శివుడిని దక్షుడు తన ఇంట ఏ కార్యక్రమం జరిగినా ఆహ్వానించేవాడు కాదు.

ఒకరోజు పరమేశ్వరుడు.. దక్షుడిని చూసి కూడా గౌరవించకపోగా.. కనీసం పలకరించను కూడా లేదు. దీంతో దక్షుడికి విపరీతమైన కోపం వచ్చింది. తనను ఎందరో దేవతలు, మహర్షులు గొప్పా గౌరవిస్తారు. అటువంటి తనను ఇలా శ్మశానంలో సంచరిస్తుండేవాడు కనీసం పలకరించడా? అని ఆగ్రహంతో ఉన్నాడు. అదే సమయంలో మహా శివుడు తన వాహనమైన పశువు మీదెక్కి తిరుగుతూ దక్షుడికి మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో శివుడిపై తన ఆగ్రహాన్నంతా వెళ్లగక్కడం ప్రారంభించాడు. అయినా సరే.. శివుడు మాత్రం కామ్‌గా ఉండిపోయాడు. దీంతో మరింత కోపంతో ఇకపై నుంచి యజ్ఞయాగాదులలో నీకు హవిస్సులు లేకుండా పోతాయని శివుడిని దక్షడు శపించాడు.

Share this post with your friends