సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు? ఎందుకు?

దేవతలు, దేవుళ్లకు వాహనాల మాదిరిగానే ఆయుధాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిని వివిధ పేర్లతో పిలుస్తారు. మనం ఎక్కువగా వినేది మాత్రం సుదర్శన చక్రం గురించే. హిందూ మత గ్రంథాలలో సుదర్శన చక్రాన్ని అత్యంత విధ్వంసకర ఆయుధంగానూ.. ఒకసారి ప్రయోగిస్తే తిరిగి తీసుకోవడానికి సాధ్యపడనిది గానూ అభివర్ణిస్తూ ఉంటారు. సుదర్శన చక్రం గురించి పురాణాలు వివరిస్తున్నాయి. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు? శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని ఎవరు.. ఎలా ఇచ్చారు? అనే విషయాలను తెలుసుకుందాం.

సుదర్శన చక్రం గురించిన ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలు పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారట. రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం అవసరమైతే.. అప్పుడు శివుడిని విష్ణుమూర్తి ప్రార్థించాడట. అప్పుడు శివుడు సుదర్శన చక్రం అందించాడట. సకల దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లారట. దీనిని విష్ణుమూర్తి కోసం శివుడు సృష్టించి ఆయనకు అప్పగించాడట. ఆ తరువాత అది పరశురాముడిని చేరుకుని అక్కడి నుంచి శ్రీకృష్ణుడిని చేరింది.

Share this post with your friends