ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?

భగవంతుడిని పూజించుకోవడానికి కూడా ఒక ప్రత్యేక సమయం అంటూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయకూడదు. అయితే ఈ పూజా సమయం దేవుడిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఆయా సమయాలను బట్టి మాత్రమే ఆయా దేవుళ్లకు మనం పూజలు నిర్వహించాలి. మరి ఏ దేవుడిని ఏ సమయంలో పూజించాలో ఒకసారి తెలుసుకుందాం. తెల్లవారుజామున మూడు గంటలకు విష్ణుమూర్తిని పూజించాలి. ఆ సమయంలో శ్రీమహావిష్ణువును పూజిస్తే ఆయన కరుణా కటాక్షాలు లభిస్తాయి.సూర్య భగవానుడిని ఉదయం 4:30 నుంచి ఉదయం 6 గంటల లోపు మాత్రమే పూజించాలి.

సూర్య భగవానుడిని పూజించే సమయం మరో ఇద్దరు దేవుళ్లకు కూడా చాలా ప్రీతి అట. వారే శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి. ఇక ఉదయం ఆరు నుంచి ఏడున్నర వరకూ మహాశివుడు, దుర్గాదేవిని పూజించాలట. ఈ సమయంలో పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందట. ఇక ఆంజనేయస్వామిని మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పూజించాలి. ఇక సూర్యాస్తమయ సమయం అంటే సాయంత్రం ఆరు గంటలకు శివుని పూజకు దివ్యమైన సమయం. సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం మెండుగా లభిస్తుంది. రాహు పూజ మాత్రం మధ్యాహ్నం మూడు గంటలకు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.

Share this post with your friends