స్వల్ప ధర్మముల వలన ఎలా పాపములు నశించి మోక్షం కలుగుతుంది?

కార్తీక మాస వ్రత మహోత్సవాన్ని జనక మహారాజుకు వశిష్టుడు చెప్పాడని ముందుగానే తెలుసుకున్నాం. అయితే వశిష్టుల వారు రోజుకో కథ చొప్పున జనక మహారాజుకు వివరిస్తుండగా మధ్యలో ఆపి జనక మహారాజు తన సందేహాన్ని వెలిబుచ్చాడు. అదేంటంటే.. ‘‘ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తే తప్ప చేసిన పాపములు పోయి మోక్షం కలుగదని మీవంటి పెద్దలే తెలియచేసితిరి కదా! మరి అలాంటప్పుడు కేవలం నదీస్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, పురాణ శ్రవణం, వనభోజనం వంటి స్వల్ప ధర్మముల వలన ఎలా పాపములు నశించి మోక్షం కలుగుతుంది? అని సందేహాన్ని వెలిబుచ్చాడు.

జనక మహారాజు ప్రశ్నకు వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి “దేశకాలపాత్రలు అనుకూలిస్తే తెలిసి కాని, తెలియక కాని భగవంతుని నామము చెప్పిన వారి సకల పాపములు పోయి ముక్తి కలుగుతుంది అని చెప్పారు. దీనికి నాలుగు వేదాలు చదివిన సత్యవ్రతుడనే విప్రుని కథను కూడా వివరించారు. దానిలో నారాయణ శబ్దం ప్రాముఖ్యతను వశిష్టుల వారు వివరించారు. నారాయణ శబ్దం వినగానే యమ భటులు ఎలా వణికి పోయారనే విషయాలను వివరించాడు.

Share this post with your friends