ఆదిత్య హృదయం పారాయణ చేస్తే ఇతి బాధలన్నీ తొలిగిపోతాయట. ముఖ్యంగా ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నిలిచి ఆదిత్య హృదయం పారాయణ చేస్తే సూర్యభగవానుని అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఆదిత్య హృదయంలో మొత్తంగా 30 శ్లోకాలుంటాయి. మొదటి ఆరు శ్లోకాలు ఆదిత్యుని పూజించడం కోసం.. ఏడవ శ్లోకం నుంచి 14వ శ్లోకం వరకూ ఆదిత్య ప్రశస్తి.. 15 నుంచి 21 వరకూ ఆదిత్యుని ప్రార్థన ఉంటుంది.
ఇక 22వ శ్లోకం నుంచి 27వరకు అన్ని శుభాల గురించి వర్ణన ఉంటుంది. ఇక ఆదిత్య హృదయం పారాయణం చేసిన వారికి అద్భుతమైన ఫలితం ఉంటుందట. జీవితంలో ఎదురైన ఆపదలు, ఒడిదుడుకులు, పట్టి పీడిస్తున్న అనారోగ్యాలు వంటి అన్నీటి బారి నుంచి ఆదిత్య హృదయం మనల్ని బయట పడేస్తుందట. తెల్లవారుజామునే ఆదిత్య హృదయం పఠనం మనకు సకల శుభాలను కలిగిస్తుందట. శత్రువినాశనం జరగాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా అలాగే మనకు ఏవైనా మనసులో కోరికలు ఉన్నా కూడా ఆదిత్య హృదయం చదివితే తప్పక నెరవేరుతాయట.