సృష్టికర్త అయిన బ్రహ్మకు పూజలు ఎందుకు చేయరు

lord brahma
ఈ సృష్టినంతా సృష్టించింది బ్రహ్మే అంటారు. అలాంటి బ్రహ్మదేవుడికి మన దేశంలో ఒకే ఒక్క ఆలయముంది. అయితే బ్రహ్మకు అసలు పూజలే చేయరు. ఎందుకని చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. కొందరు ఏదో విధంగా సందేహ నివృత్తి చేసుకుంటారు. మరికొందరు తెలిసినప్పుడు అదే తెలుస్తుందిలే అని ఊరుకుంటారు. బ్రహ్మ అసలు పూజార్హతను ఎందుకు కోల్పోయాడు? అంటే.. పద్మపురాణం ప్రకారం ఒక కథ ఉంది. పుష్కర్ దగ్గర లోక కల్యాణార్థమై బ్రహ్మదేవుడు ఓ యాగం చేశాడు. అయితే ఈ యాగం సతీమణితో కలిసి చేయాలి. కానీ బ్రహ్మ సతీమణి సరస్వతీదేవి ఈ పూజకి ఆలస్యం చేసింది.

పూజ సమయం దాటిపోతోందని భావించిన బ్రహ్మ దేవుడు అక్కడే ఉన్న ఓ గొర్రెల కాపరిని వెంటనే వివాహం చేసుకుని ఆమెతో కలిసి యాగంలో కూర్చున్నాడు. కాసేపటి తర్వాత సరస్వతి దేవి ఆ యాగశాలకు చేరుకుంది. బ్రహ్మ పక్కన మరో స్త్రీ ఉండటాన్ని చూసి ఆగ్రహించిన సరస్వతీదేవి బ్రహ్మను శపించింది. ఈ లోకం బ్రహ్మను మరువడమే కాకుండా ఆయనకు పూజలు చేయదని శాపం ఇచ్చింది. సరస్వతీ దేవిని శాంతించాలంటూ అక్కడున్న దేవతలంతా కోరారు. శాపం ఇచ్చాక వెనక్కి తీసుకోవడం కష్టం. అందుకే బ్రహ్మదేవుడికి భూమ్మీద ఒకే ఒక్క గుడి ఉంటుందని అక్కడ మాత్రమే పూజలందుకుంటాడని చెప్పింది. ఇదన్నమాట బ్రహ్మకు పూజలు చేయకపోవడానికి కారణం.

Share this post with your friends