Where To Plant Neem Tree : ఇంటి ఆవరణలో వేపచెట్టు ఉండవచ్చా… ఉంటే ఏమౌతుంది?

ఇంటి ఆవరణలో వేపచెట్టు పవిత్రతకు, ఆరోగ్యానికి ప్రతీకగా భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దాన్ని సరైన దిశలో నాటినప్పుడే శుభఫలితాలు లభిస్తాయి. వేప చెట్టు ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండకూడదు, అలాగే దక్షిణం లేదా నైరుతి దిశల్లో ఉండటం వాస్తు దోషానికి కారణమవుతుందని పెద్దలు చెబుతారు. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వేప చెట్టు నీడ నేరుగా ఇంటిమీద పడితే ఛాయ దోషం ఏర్పడి అనారోగ్యాలు, కలహాలు పెరుగుతాయని విశ్వాసం. అందుకే తూర్పు దిశలో, ఇంటి పునాదిని వేర్లు తాకని విధంగా వేపచెట్టు నాటితే అది ఔషధ గుణాలతో పాటు దైవ అనుగ్రహాన్ని కూడా అందిస్తుంది. ప్రకృతి దేవతగా భావించే వేపచెట్టును భక్తితో పూజిస్తూ, వాస్తు నియమాలు పాటిస్తే ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిలుస్తాయని పండితులు చెబుతారు.

Where To Plant Neem Tree
Where To Plant Neem Tree
Share this post with your friends