బంధ విముక్తులము – ఎప్పుడు అవుతాము?

ప్రతి వ్యక్తి బంధాలకు బానిసే. మరి మనం బంధ విముక్తులం అయ్యేదెప్పుడు? శ్రీ కృష్ణుడు అర్జునుడితో అన్నాడు… “సదా నన్ను ధ్యానిస్తూ యుద్ధచేయి,” అని అన్నాడు. అప్పుడు అర్జునుడు కంగారు పడ్డాడు..”నేను యుద్ధచేస్తున్నాను, నువ్వు నాకు వేదాంతం బోధిస్తున్నావు, యుద్ధము, వేదాంతము ఒక దాని కొకటి చుక్కెదురు…” నిప్పు, నీళ్ళల్లాంటివి ఆ రెండింటికీ సాపత్యమెక్కడ? నేను నీ నుండి వేదాంత బోధలు వింటున్నప్పుడు నాకు యుద్ధం చేయాలన్న ఇచ్ఛ ఉండదు. యుద్ధం చేస్తున్నప్పుడు వేదాంతం వినడానికి సహనం ఉండదు,” అన్నాడు.

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా జవాబిచ్చాడు, “అర్జునా! వేదాంతం అన్నది ఒక జీవన మార్గం, జీవన సమరం, నన్ను ధ్యానిస్తూ యుద్ధము చేసినపుడు, నీకు యే పాపమూ అంటదు. నీవు చేసే ప్రతీ పనీ నాకు అర్పించినపుడు, ఆ పనులు మూలంగా కలిగే ఫలితానికి నువ్వు బంధితుడవు కావు. “సర్వం శ్రీ కృష్ణార్పణం” చేసే పని పూజగా మారి పోతుంది. భగవంతుని చేతిలో నువ్వు ఒక పనిముట్టువు మాత్రమే అనుకోవాలి… అపుడే బంధవిముక్తుడవు అవుతావని చెప్పాడు. మనం కూడా అలా చేస్తే బంధ విముక్తలం అవుతామని పండితులు చెబుతారు.

Share this post with your friends