తులసి వివాహం నాడు ఏం చేయాలి?

కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిథి నాడు తులసి వివాహం జరిపిస్తారని చెప్పుకున్నాం కదా.. అంటే ఈ నెల 13వ తేదీన వివాహాన్ని జరిపిస్తూ ఉంటారు. తులసి వివాహం రోజున ఏం చేయాలో తెలుసుకున్నాం. ముందుగా తులసి మొక్కకు పుసుపు, కుంకుమ, చందనంతో అలంకరించాలి. ఆ తరువాత శాలిగ్రామ రాయిని గంగాజలంతో కడిగి శుభ్రం చేసి తులసి ఆకులతో అలంకరించాలి. తులసి వివాహం కోసం ముందుగా ఒక చిన్న మండపాన్ని సిద్ధం చేయాలి. ఆ తరువాత దాన్ని పూలతో అలకంకరించాలి.

తులసి వివాహం కోసం సిద్ధం చేసిన మండపం ముందు ముగ్గులు వేయాలి. ఆ తరువాత దీపం, అగరుబత్తీలు, ధూపం, బియ్యం, పువ్వులు, పండ్లు వంటి వాటన్నింటినీ పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. వివాహం కోసం వీలైతే పండితులను పిలవాలి. తులసి వివాహానంతరం మీకు ఉన్నంతలో దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అంటే పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం శుభ ప్రదం. ఇక తులసి వివాహం జరిపించేవారు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. మాంసాహారం, మద్యం సేవించకూడదు. గొడవలు, వాదనలు, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.

Share this post with your friends