గబ్బిలం, కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది?

ఇంట్లోకి కొన్ని జంతువులు, పక్షులు ప్రవేశించినప్పుడు కొన్నింటిని శుభంగానూ.. మరికొన్నింటిని అశుభంగానూ పరిగణిస్తూ ఉంటాం. అసలు ఏ పక్షులు ఇంట్లోకి ప్రవేశిస్తే మంచిది కాదో తెలుసుకుందాం. అలాగే వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి గబ్బిలం, కాకి వంటి పక్షులు ప్రవేశిస్తాయి. మరి వాటి ప్రవేశం మంచిదా? కాదా? అనేది తెలుసుకుందాం. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఇంట్లోని వారు కూడా మనశ్శాంతిగా ఉంటారట. అయితే ఇంట్లోకి కాకి వస్తే మాత్రం దరిద్రానికి సంకేతమని చెబుతారు. శనీశ్వరుడి వాహనంగా కాకిని పరిగణిస్తారు కాబట్టి అది ఇంట్లోకి రావడం అశుభం.

కొన్ని నమ్మకాల ప్రకారం కాకి ఇంటిపై ఉండి అరిస్తే చుట్టాలు వస్తారనే దానికి సంకేతమంటారు. అదే కాకి ఇంట్లోకి ప్రవేశిస్తే మాత్రం మనకు చెడు వార్తలు అందే అవకాశముందని చెబుతారు. గబ్బిలం కూడా ఇంట్లోకి రావడం అశుభానికి సంకేతమని చెబుతారు. గబ్బిలం ఇంట్లోకి వస్తే ఆ ఇల్లును కొన్నేళ్లపాటు వదిలేస్తారు. గబ్బిలం ఇంట్లోకి రావడం చెడు శక్తులు ప్రభావం చూపుతున్నాయని సూచించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ కుటుంబంలో సమస్యలు పెరిగే అవకాశముందని చెబుతారు. కాబట్టి గబ్బిలం ఇంట్లోకి ప్రవేశించగానే ఎలాంటి చెడు శక్తుల ప్రభావం ఉందో పరీక్షించుకోవాలని సూచిస్తారు.

Share this post with your friends