గురువు గురించి భగవద్గీత ఏం చెబుతోందంటే…

సమాజంలో వినయ–విధేయతలు క్షీణిస్తున్న ఈ కాలంలో, గురుత్వం అనే తత్త్వం మళ్లీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే.. గురువు ఒక మనిషి మాత్రమే కాదు; ఆయన ఒక దారి దీపం, ఒక తత్త్వం, ఒక సంచార వేదం.

1. వేదాల దృష్టిలో గురువు

వేదం ఆజ్ఞాపిస్తుంది: “ఆచార్యదేవో భవ” అంటే గురువును దేవునిగా భావించు. ఇది ఒక భావోద్వేగ వాక్యం కాదు. ఇది జీవన విధానం. వినయమే విద్యకు ద్వారం. వినయం లేని వాడికి విద్య కూడా విషమవుతుంది.

2. ఉపనిషత్తుల బోధ

“తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్ఛేత్ సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్.ఆదిత్యయోగీ. జ్ఞానం కోరువాడు సమిత్ (సమర్పణ భావం) చేత పట్టుకుని గురువును ఆశ్రయించాలి. ఇక్కడ “సమిత్పాణిః” అంటే చేతిలో కట్టెలు కాదు. అది అహంకారాన్ని అర్పించిన చేతి సూచిక.

3. భగవద్గీత బోధ

భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా ఉపదేశిస్తాడు. “తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా” (4.34) అంటే వినయంతో నమస్కరించి, సాత్విక ప్రశ్నలతో, సేవతో గురువును చేరుకో.

ఇక్కడ మూడు మార్గాలు చెప్పారు:

1. ప్రణిపాతం – అహంకార నాశనం
2. పరిప్రశ్న – జిజ్ఞాస
3. సేవ – కృతజ్ఞత

ఇవే అనుగ్రహ ద్వారాలు.

Share this post with your friends