ఈ ఆరు పనులు చేసిన వ్యక్తి ధర్మనాథుడట..

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు, పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యంలోకి రాలేదు!

కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః
(కామందక నీతిశాస్త్రం)

1. కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి!

2. కరణేషు దక్షః :
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.

3. రూపేచ కృష్ణః:
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః:
ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.

5. భోజ్యేషు తృప్తః:
భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా)భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం:
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

Share this post with your friends