వాల్మీకి యోగవాశిష్టంలో ఏం చెప్పాడు?

వాల్మీకి మహర్షి కేవలం రామాయణం గురించే కాకుండా యోగవాశిష్టం అనే గ్రంథాన్ని సైతం రచించాడు. రామునికి వశిష్టుడు చెప్పిన యోగా–ధ్యాన తత్వాలను ఇందులో వివరించాడు. అంతేకాక ఆదిత్యహృదయం, కౌసల్యా సుప్రజా రామ వంటి స్తోత్రాలు, సుప్రభాతములు కూడా ఆయనే రచించారు. రామాయణం 24,000 శ్లోకాలతో కూడిన ఈ కావ్యం భారతీయ ధర్మం, సంస్కృతి, కుటుంబ నడవడికలు, సంబంధ బాంధవ్యాలపై అజరామరమైన ప్రభావాన్ని చూపింది. తండ్రీ–కొడుకు, భార్య–భర్తలు, అన్నదమ్ములు, రాజు–ప్రజలు, భక్తుడు–భగవంతుడు వంటి ప్రతి సంబంధానికి ఆదర్శ ప్రమాణాలు రామాయణంలో కనబడతాయి.

పండితులు వాల్మీకిని “కవికోకిల” అని వర్ణించారు:

కూజంతం రామ రామేతి మధురమ్ మధురాక్షరమ్ ।
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ॥

కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, మధురమైన రామనామాన్ని పాడే కోకిలగా ఆయనను కీర్తించారు. రామాయణం సమయగమనంలో అనేక మార్పులు ఎదుర్కొన్నా, వాల్మీకి మహర్షి రాసిన అసలు కావ్యం నేటికీ ఆదికావ్యంగా నిలిచింది. పాశ్చాత్యులు దీన్ని క్రీపూ 500లో రచించబడిందని నమ్ముతారు. భారతీయ దార్శనికులు మాత్రం లక్ష సంవత్సరాల ప్రాచీనమని విశ్వసిస్తారు. వాల్మీకి మహర్షి మనకు అందించినది కేవలం ఒక కావ్యం కాదు, ఆదర్శ జీవనానికి శాశ్వత ప్రమాణం.

Share this post with your friends