
“అష్టసిద్ధి నవనిధికే దాతా” — హనుమాన్ చాలీసాలోని నామమిదే. హనుమంతుడు తన భక్తులకు వారి భక్తి బలానికి అనుగుణంగా అష్టసిద్ధులు, నవనిధులు అనుగ్రహిస్తారని తులసీదాసు పేర్కొన్నారు.
అష్టసిద్ధులు..
అణిమా – అణువులా సూక్ష్మరూపాన్ని పొందడం
మహిమా – కోట్ల బ్రహ్మాండాల కంటే విస్తరించడం
లఘిమా – పరమాణువుల కంటే తేలిక కావడం
ప్రాప్తి – కోరిన దానిని పొందగల శక్తి
ప్రాకామ్యము – అనుకున్నది సాధించగల శక్తి
ఈశత్వం – అన్నిటిపై అధికారాన్ని సంపాదించడం
వశిత్వం – అందరినీ వశం చేసుకోవడం
గరిమా / సర్వకామసిద్ధి – అత్యంత బరువుగా మారడం లేదా అన్ని కోరికలను తీర్చుకోవడం
నవనిధులు..
పద్మం
మహాపద్మం
శంఖం
మకరం
కచ్ఛపం
ముకుందం
నీలం
కుందం
వరం
ఇవి ఐశ్వర్యానికి ప్రతీకలు. మహాలక్ష్మి కృప వల్ల కుబేరుని వద్ద లభించినవే. భూ, జల, లోహ, ధన, ఐశ్వర్య సంపదలకు ఇవి ఆధారమని శాస్త్రాలు చెబుతున్నాయి. హనుమంతుని అనుగ్రహం లభించినవారికి – జ్ఞానం, శక్తి, సంపద, ఐశ్వర్యం అన్నీ సమకూరుతాయి.
