సూర్యుడి ఏడు గుర్రాలను ఏమని పిలుస్తారు?

ప్రతి ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు. నిన్న దేశమంతా రథసప్తమిని జరుపుకుంది. అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. మన సంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది, దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు.

సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు, అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది.

మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. 50 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశులకు కనకవర్షం ఖాయం..!ఏడు గుర్రాలు ఎందుకంటే.. సూర్యుడు ఏడు గుర్రాలు ఏడు వారాలకు సంకేతాలు. ఈ ఏడు గుర్రాలను వేదఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే ఏడు గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు.

Share this post with your friends