సూర్యుని 12 నామాలేంటి? అర్ఘ్యం ఇవ్వడం వలన ఏం జరుగుతుంది?

సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆయన 12 నామాలను ఉచ్చరిస్తూ చేయాల్సి ఉంటుంది. ఈ 12 నామాలను ఉచ్చరిస్తూ అర్ఘ్యం సమర్పిస్తేనే విశేష ప్రాధాన్యత. ప్రధానంగా 12 నామాలు పేర్కొనబడ్డాయి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. ఈ నామాలను చదువుతూ సూర్యుడికి అర్ఘ్యమివ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్ఘ్యమైనా ఇవ్వవచ్చే. లేదంటే అన్నింటినీ కలిపి ‘మిత్రరవిసూర్యభానుఖగపూషహిరణ్యగర్భమరీచ్యాదిత్యసవిత్రర్కభాస్కరేభ్యో నమః’ అంటూ ఒకే అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఇలా అన్ని నామాలను కలిపి ఏడు మార్లు అర్ఘ్యమిస్తే మంచిదట.

సూర్యనారాయణుడికి అర్ఘ్య ప్రదానం వల్ల కలిగే ఫలితాలు అద్భుతమైనవని పండితులు చెబుతారు. ముఖ్యంగా సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా భావిస్తారు కాబట్టి శారీరక ఆరోగ్యం సమకూరుతుంది. అలాగే ప్రారబ్ధ కర్మల వల్ల సంభవించే రోగాలను సైతం సూర్యుడు నయం చేస్తాడట. అది మాత్రమే కాకుండా మన పాపాలన్నింటినీ పోగొడతాడట. సూర్య భగవానుడు శబ్ద ప్రియుడు అని, దేవతలు శబ్దానికి ప్రీతిపాత్రులని చెబుతారు కాబట్టి మనం పఠించే మంత్రాలు, నామాలలో ఉన్న శబ్ద ప్రకంపనలు సైతం అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయట. అందువల్ల సూర్యుడి అన్ని నామాలను ఉచ్చరిస్తూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.

Share this post with your friends