Unknown Facts : హిందువులు తెలుసుకోవల్సిన ఆసక్తికర విషయాలు

హిందువులు తెలుసుకోవల్సిన ఆసక్తికర విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గాయత్రిదేవి చేతిలోని కపాలం పేరు బ్రహ్మకపాలం.
2. కలిపురుషుడు అడుగిడలేని ప్రదేశం నైమిశారణ్యం.
3. అగ్నిదేవుడి పేరు వైశ్వానరుడు. పరమేశ్వర అనుగ్రహము వలన ఆగ్నేయ దిక్పాలకుడై అగ్ని అయినాడు.
4. శనివారం తప్ప ఇతర వారములలో రావిచెట్టును తాకరాదు.
5. కదంబ వృక్షము శ్రీదేవి స్వరూపము. మేడిచెట్టు దక్షిణామూర్తి స్వరూపము.

హిందువులు తెలుసుకోవల్సిన ఆసక్తికర విషయాలు
హిందువులు తెలుసుకోవల్సిన ఆసక్తికర విషయాలు

6. గండకీనది ఒడ్డున లభించే శిలలే సాలగ్రామ శిలలు. విష్ణుమూర్తికి ప్రతిరూపాలు.
7. గ్రహణ సమయమున సంభోగం మిక్కిలి దోషం.
8. పూజ చేసే సమయంలో మంచి కుంకుమనే ధరించాలి. (బొట్టుబిళ్ళలు పనికిరావు)
9. దుర్గాదేవిని గరికతో, తులసీదళాలలో పూజించరాదు. అమ్మవారి పూజకు బంతిపూలు నిషిద్ధం.
10. నందీశ్వరుని తండ్రిపేరు శిలాధ మహర్షి.
11. లక్ష్మీతామర పూలు పూజకు సర్వశ్రేష్ఠం. (అందరు దేవతలకు)
12. తెల్లని పూలతో పూజించడం వలన మనఃశ్శాంతి కలుగుతుంది.
13. ఆసనములలో సర్వశ్రేష్ఠమైనది దర్భాసనము.
14. గృహస్తుడు, పతివ్రతా సదా తాంబూల చర్వణం చేయాలి.
15. బియ్యం పిండితోనే ముగ్గువేయాలి. (రాతి ముగ్గు వాడరాదు)
16. అగరువత్తులు వెలిగించి దేవుడి చుట్టూ తిప్పకూడదు. ధూపం మాత్రం చేతితో చూపించాలి.
17. ప్రదక్షిణ చేయునపుడు చాలా నిదానముగా అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణం చేయవలెను.
18. రావణబ్రహ్మ అసలు పేరు పొలశ్య బ్రహ్మ. రావణ బిరుదము ఇచ్చినది శివుడు

Share this post with your friends