
నేడు తైపూసం. తారకాసుర సంహారార్థం సుబ్రహ్మణ్య స్వామి అవతరించిన విషయం తెలిసిందే. అయితే తన పుత్రుడు సుబ్రహ్మణ్యుడికి పార్వతీ దేవి శక్తి ఆయుధం (వేలు) ప్రసాదించిన పవిత్ర దినమిది. జ్ఞాన సిద్ధి, ఆత్మబల వృద్ధికి ఈ రోజు మురుగన్‌ను తమిళులంతా ఆరాధిస్తారు. తమిళ మాసమైన తై నెలలో, పుష్య నక్షత్రం వచ్చిన రోజునే తైపూసంగా తమళులంత జరుపుకుంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి (మురుగన్) తన తల్లి పార్వతీ దేవి నుంచి వేలును (వెల్) అనే దివ్యాయుధాన్ని పొందిన పవిత్ర దినం.
అహంకారానికి ప్రతీక అయిన సూరపద్మాసురుని సంహరించి ధర్మాన్ని స్థాపించిన రోజు కావడంతో తైపూసం భక్తులకి అత్యంత విశేషం. కావడి మోయడం, ఉపవాసం, శరీర తపస్సులు, దీపారాధన వంటివన్నీ మనస్సు శుద్ధి, సంకల్ప బలం, భక్తి పరాకాష్టకు సూచికలు. ఈ రోజు మురుగన్‌ను స్మరిస్తే మనోబలం పెరుగుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. సంకల్పసిద్ధి కలుగుతుంది. తమ ఇష్టదైవం మురుగన్ అయితే నేడు కొద్ది సేపు తప్పక శ్రీ సుబ్రమణ్య ధ్యానం చేస్తారు.
