ఆ ఒక్క మాట మనలో ఎన్ని మార్పులు తెస్తుందంటే..

“అందరూ బాగుండాలి!” అనేది కేవలం ఓ వాక్యం మాత్రమే కాదని.. అది ఒక దివ్య మంత్రం..! అన్ని ఇతర మంత్రాలకంటే అదే గొప్పగా పని చేస్తుంది. ప్రయోగించి చూసిన వారికి దాని ఫలితాలు పూర్తిగా తెలుస్తాయి. ‘అందరూ బాగుండాలని అనుకోవల్సిన అగత్యం ఏమిటి?’అంటూ ఎదురుప్రశ్న వేసే వారున్నారు. ‘ఇతరుల బాగు కోరితే ఏం వస్తుంది?’ అన్నది వారు వేసే రెండో ప్రశ్న. అందరూ బాగుండాలని అనుకోవడం వెనుక ఓరహస్యం ఉంది. “సర్వేజనా స్సుఖినో భవంతు!” అనేది పెద్దల మాట!ఇతరులు బాగుండాలని కోరుకునే వాడు…. తానూ బాగుంటాడు.

ప్రతి రోజూ… తనకు సంబంధంలేని మనిషి క్షేమం కోరి హృదయ పూర్వకంగా ప్రార్థన చేసే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం! ఈ ఆరోగ్యం- ఆనందం… కోసం అతడు ఎక్కడికీ వెళ్ళనక్కర లేదు. అలా ప్రార్థన చేస్తున్నపుడే ఇతని శరీరంలో మార్పులు కలుగుతాయి. మనసులో చక్కటి భావప్రకటనలు ఏర్పడి ధ్యానంగా మారి రోగాల్ని దూరం చేస్తాయి. లోక క్షేమం కోరుకునేవారి బాగును భగవంతుడే చూస్తుంటాడు. నలుగురు ఇళ్ళు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరు ఉండనిస్తారు?

నిజాయితీగా నిస్వార్థంగా ఉండేవారు, నలుగురి క్షేమమూ కోరేవారే ఈ లోకానికి కావాలి. వారందరి ఉమ్మడి రూపమే దివ్యశక్తి ! దాన్ని ఏదేవుడి పేరుతో నైనా పిలుచుకోవచ్చు.

Share this post with your friends