కృష్ణ కమలం పువ్వులో కనిపించే మహాభారత చిహ్నాలేంటంటే..

కృష్ణ కమలం పువ్వులో శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడని చెప్పుకున్నాం కదా. శ్రీ కృష్ణుడి పాత్ర, ఆయన అవతారాలు, విశ్వ సృష్టి రహస్యానికి ఈ కృష్ణ కమలం పువ్వు చిహ్నమని చెబుతారు. కృష్ణ కమలం ఇంట ఉంటే ఎలాంటి నెగిటివిటీ మన ఇంటి దరి చేరదట. ఇది ఇంట్లో అదృష్టం, ప్రేమను పెంచుతుందని చెబుతారు.

కృష్ణ కమలం పువ్వులో మహాభారత చిహ్నాలు ఉన్నాయని చెబుతారు కదా.. అవేంటో తెలుసుకుందాం. కృష్ణ కమలం పువ్వులో 100 సన్నని గీతలు ఉంటాయి. ఆ వంద గీతలు 100 మంది కౌరవులకు సంకేతాలని చెబుతారు.

అలాగే ఈ పువ్వులో ఉండే 5 మందపాటి రేకులు.. పంచపాండవులని పేర్కొంటారు. కృష్ణ కమలం పువ్వులో మూడు కేంద్ర బిందువులు ఉంటాయి. వాటిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతాలుగా చెబుతారు. పువ్వులోని కేంద్రీకృత నిర్మాణం.. సృష్టి కేంద్రమైన పరమాత్మకు సంకేతమట. దీనిలోని గుండ్రని వృత్తం.. కృష్ణుడి ప్రధాన ఆయుధమైన సుదర్శన చక్రానికి చిహ్నమట. ఆకుపచ్చ-ఊదా రంగు తీగలు నెమలి ఈకలు, వేణువు తరంగాలకు సంకేతం.

ఇలా పువ్వులోని ప్రతిదీ కృష్ణ తత్వాన్ని ప్రతిబింబిస్తుందని పండితులు చెబుతారు. అందుకే ఈ మొక్క ఇంట ఉంటే కన్నయ్య ఉన్నట్టేనట.

Share this post with your friends