తీర్థ యాత్రల ఆవశ్యకత ఏంటంటే..

పుణ్యక్షేత్రాలు.. దేవతలు, ఋషులు, మహా పురుషుల పాద ధూళితో మరింత పవిత్రమమై ఉంటాయి. అంతేకాకుండా ఆలయాల్లోని కోనేటి నీరు ఎన్నో ఔషధ గుణాలు సంతరించుకుని ఉంటుంది. వాటికి పెద్ద పెద్ద రోగాలను సైతం నయం చేసే శక్తి ఉంటుందని చెబుతారు. అందుకే తప్పనిసరిగా తీర్థయాత్రలు చేయాలని చెబుతారు.

వనవాసం సమయంలో పాండవులు సైతం శ్రీకృష్ణుని సూచనల ప్రకారం అనేక పుణ్యక్షేత్రాలు సందర్శించినట్లుగా మహా భారతంలో వివరించి ఉంది. వీరు సందర్శించిన ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయని చెబుతారు.

అలాగే పరశురాముడు, ఇతర పురాణ పురుషులు, మహర్షులు ఎందరో తీర్థయాత్రలు చేసి ముక్తిని పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీరాముడు కూడా రావణ సంహారం తరువాత బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి అనేక తీర్థయాత్రలు చేశాడని అనేక పురాణాల్లో ఉంది. అలాగే సాక్షాత్తు పరమశివుడు సైతం బ్రహ్మ శిరస్సు ఖండించిన పాపాన్ని పోగొట్టుకోవడానికి అనేక తీర్థయాత్రలు చేశాడట. బ్రహ్మ కపాలం చేత ధరించి మరీ పుణ్యక్షేత్రాలు సందర్శించాడని శివపురాణంలో వివరించి ఉంది. అలాగే బలరాముడు సైతం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు తీర్థయాత్రలు చేశాడట.

Share this post with your friends