పసుపు కొమ్ముల మాల వెనుక పౌరాణిక గాథ ఏంటంటే..

దుర్గమ్మకు పసుపు కొమ్ముల మాల వేస్తే చాలా మంచి జరుగుతుందట. వీలైతే ఆ మాల కట్టేటప్పుడు లలితా సహస్రనామాలు పఠిస్తే చాలా మంచిదని చెబుతారు. ఇక వివాహం కాని వారు పసుపు కొమ్ముల మాల వేస్తే త్వరగా వివాహమవుతుందట. ముత్తైదువులైతే సౌభాగ్యం, భర్త శ్రేయస్సు కోసం పసుపు కొమ్ముల మాల వేస్తారు. అలాగే ఇంట్లో కానీ లేదంటే వ్యాపార ప్రదేశంలో కానీ నరఘోష, దృష్టి దోషాలు అధికంగా ఉన్నవారు సైతం అమ్మవారికి ఈ పసుపు కొమ్ముల మాల సమర్పిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఇక ఈ పసుపు కొమ్ముల మాల వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటనేది తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం చూస్తే దుర్గమ్మ శుంభ-నిశుంభులనే రాక్షసులను సంహరించిందని తెలిసిందే. అయితే సంహారానికి ముందు వారి సైన్యాధిపతి రక్తబీజుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందట. కానీ రక్తబీజుడి రక్తం చుక్కలు నేలపై పడితే మళ్లీ వందలాది మంది రాక్షసులు పుట్టుకొస్తారు. ఆ సమయంలో అమ్మవారు యుద్ధం వల్ల కలిగే ఉగ్రతను, తాపాన్ని, యుద్ధంలో కలిగే గాయాల నుంచి ఉపశమనానికి అమ్మవారు పసుపును ఆశ్రయించిందని దేవీభాగవతం చెబుతోంది. పసుపులోని క్రిమిసంహారక గుణం, శాంతిని ఇచ్చే స్వభావం వల్ల అమ్మవారు ఉగ్రరూపాన్ని వీడి ప్రశాంతంగా మారుతుందని నమ్మకం. కాబట్టే అమ్మవారి చల్లని చూపు కోసం ఈ పసుపు కొమ్ముల మాలను వేస్తారు.

Share this post with your friends