భగవంతుడిని ఏదైనా అడిగితే ఇవ్వలేదని నిరుత్సాహ పడుతూ ఉంటాం కానీ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో దానిని అందిస్తాడట. ధైర్యం అడిగితే.. ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమని చెబుతాడట. అలాగే ఆలయానికి వెళ్లి వరాలు అడుగుతాం.. భగవంతుడు అవకాశాలు ఇచ్చి సాధించుకోమని చెబుతాడు. భగవంతుడిని ప్రేమను అడిగితే.. ఆపదల్లో ఉన్నవారి చెంతకు పంపించి వారికి సాయం చేయించి ప్రేమను పొందే మార్గాన్ని చూపిస్తాడట. జ్ఞానాన్ని అడిగితే భగవంతుడు మనకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమని చెబుతాడట.

పురోగతి అడిగితే.. భగవంతుడు మనకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు. అలాగే లోకానికి మంచి చెయ్యాలని అడిగితే.. భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమని చెబుతాడట. భగవంతుడిని ఏమీ మరువకూడదని అడిగితే.. భగవంతుడు భాధలు ఇచ్చి తనను గుర్తుంచుకోమన్నాడు. పాపాలు క్షమించమని అడిగితే.. భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమని చెబుతాడట. అలా జీవితంలో మనం నేరుగా కోరుకున్నదేదీ పొందలేదు కానీ.. ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటన నుంచి అవసరమైనది పొందటం ఎలాగో.. చివరకు ఏది జరిగినా మన మంచికే అని అర్ధం చేసుకోవాలి.
