Surya Arghyam : సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చిన తరువాత ఈ పనిచేయండి…జీవితంలో జరిగే మార్పులు ఊహించలేరు

ఉదయించే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆచారం. సూర్యుడు జీవనశక్తికి ప్రతీక. ఆయనకి నీరు అర్పించడం ద్వారా మనలోని నెగటివ్ ఎనర్జీ తొలగి, పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయని నమ్మకం. రాగి పాత్రలో నీరు తీసుకుని, అందులో కుంకుమ, ఎర్రటి పువ్వు, కొద్దిగా బియ్యం వేసి సూర్యునికి అర్పిస్తే సూర్యగ్రహ బలం పెరుగుతుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ఆర్ఘ్యం ఇచ్చిన తరువాత నేలపై పడిన నీటిని చేతితో తాకి నుదిటికి పూయడం వల్ల సూర్య శక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుందని విశ్వాసం. ఇది శరీరాన్ని శుద్ధి చేసి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజూ ఈ విధంగా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలో క్రమంగా శ్రేయస్సు, స్థిరత్వం, ఆనందం లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు.

Significance of Offering Water to Surya Dev
Significance of Offering Water to Surya Dev
Share this post with your friends