Significance Of Nandi : శివాలయంలో నందికి ఎందుకంత ప్రాధాన్యత?

ఏదైనా శివాలయంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా కనిపించేది నందీశ్వరుడు. ముందుగా ఆయనను దర్శించుకున్న మీదటే పరమేశ్వరుడిని మనం కొలుచుకుంటాం. నందీశ్వరుడి రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. మరికొందరు నందీశ్వరుడి చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరుడికి నందీశ్వరుడు ద్వారపాలకుడని చెబుతారు. అందుకేనా ఆయనకంత ప్రాముఖ్యత? అసలు పరమేశ్వరుడికి నందికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటనేది తెలుసుకుందాం. పవిత్ర కార్తిక మాసం సందర్భంగా నందీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుందాం.

Significance Of Nandi
Significance Of Nandi

పూర్వం శిలాదుడనే రుషికి కావల్సినంత జ్ఞానం.. అంతకు మించిన గౌరవం అన్నీ ఉన్నా కూడా సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉండేవారు. దీంతో తనకు సంతాన భాగ్యం కలిగించమని కోరుతూ.. పరమశివుని కోసం తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినా కూడా శిలాదుని తపస్సు ఆగలేదు. చివరకు ఒంటినిండా చెదలు పట్టేసింది. అయినా సరే.. శిలాదుని నిష్ఠ తగ్గలేదు. చివరకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. దీనికి శివుడు తనకు అయోనిజుడైన కుమారుడు కావాలని తెలిపారు. శిలాదుడి భక్తికి సంతోషించిన శివయ్య వరాన్ని అనుగ్రహించాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం.

Share this post with your friends