Significance of Mahakaleshwar Jyotirlinga : మహాకాళేశ్వరాలయంలో రహస్యాలకు నిలయం.. భస్మ మందిరం

ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయం గురించి చాలా ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం కదా. మహాకాళేశ్వర ఆలయం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవది.. అత్యంత ప్రధానమైనదని తెలుసుకున్నాం కదా.. ఇక ఈ ఆలయంలో భూ అంతర్భాగంలో ఉండే మందిరాన్ని భస్మమందిరం అని పిలుస్తారు. ఇది ఎన్నో రహస్యాలకు నిలయంగా పేర్కొంటారు. ఉజ్జయిని మహాకాళేశ్వరుని అంతరాలయంలో రెండు జ్యోతులు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయి. ఈ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఇవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. కొండెక్కడం అనేది ఉండదని చెబుతారు.

Significance of Mahakaleshwar Jyotirlinga
Significance of Mahakaleshwar Jyotirlinga

ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఒక విచిత్రమైన మందిరంగా భస్మ మందిరాన్ని అభివర్ణిస్తారు. ఈ మందిరంలో విభూతిని ఎలా తయారు చేస్తారో తెలుసా? ఆవు పేడతో తయారు చేస్తారు. స్వామివారికి అభిషేకం ఈ విభూతితోనే చేస్తారు. ఇక ఇక్కడ మనం తప్పక చూడవల్సిన కార్యక్రమం ఒకటి ఉంది. అదే మహాకాళేశ్వరుడి భస్మ హారతి. ప్రతి రోజు తెల్లవారుజామున జరుగుతుంది. ఈ హారతిని దర్శించుకోవాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలని పెద్దలు చెబుతారు. మహాకాళేశ్వరునికి జరిగే భస్మాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. దీని గురించి వివరణాత్మకంగా మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends