Shivakesava Temple in Mauritius : మారిషస్‌లో శివకేశవుల ఆలయం గురించి తెలుసా?

మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ హిందూ దేవతల ఆలయాలున్నాయి. వాటిలో మారిషస్ కూడా ఒకటి. సాంస్కృతిక, మత వైవిధ్యాలకు నిలయమైన మారిషస్ నడిబొడ్డున కూడా అద్భుతమైన హిందూ దేవస్థానం ఉంది. అదే హరి హర దేవస్థానం. ఇది శికేశవులకు అంకితమైన దేవాలయం. అంతేకాకుండా మారిష ద్వీపం గొప్ప భారతీయ వారసత్వానికి సాక్ష్యంగా నిలిచే హిందూ అభయారణ్యం. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు) దేవతలకు అంకితం చేయబడిన ఈ ఆలయం. మారిషస్‌లోని హిందువులకు ఇది అత్యంత ఇష్టమైన ప్రదేశం. ప్రధాన ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా సందర్శకులకు సైతం ప్రధాన సాంస్కృతిక ఆకర్షణ.

Shivakesava Temple in Mauritius
Shivakesava Temple in Mauritius

బ్రిటిష్ వలస పాలన కాలంలో భారతీయ వలసదారులు ఈ హరి హర దేవస్థానాన్ని నిర్మించారు. ప్రధానంగా దక్షిణ భారతదేశంతో పాటు బిహార్ నుంచి వచ్చిన కాంట్రాక్ట్ వర్కర్స్ అంతా తమ మతపరమైన సంప్రదాయాలకు అనుకుగణంగా దీనిని నిర్మించారు. క్రమంగా తమ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ప్రార్థనా స్థలాలను స్థాపించారు. 20వ శతాబ్దం సెకండ్ హాఫ్‌లో ఈ ఆలయాన్ని నిర్మించారు. చాలా మంది హిందువులు ఈ ఆలయ నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. ఆలయ నిర్మాణం తరువాత కూడా ఆలయ విస్తరణ, పునరుద్ధరణ పనులను జరుపుకుంది.

 

Share this post with your friends