Shani Sancharam : జాతకంలో శని సంచారం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలో చెప్పే కథ ఇది..

కాశ్మీర దేశంలో ఒక పండితుడు వుండేవాడు. ధ్యానం జపం దైవారాధన, భక్తి కలిగి మంచి శీలం కలిగి పది మందికి మాట సహాయమో లేక తనకు తోచిన సేవ చేసేవాడు. కాలం అలా జరిగిపోతూ ఉంది. కానీ పండితుడికి జీవితంలో ఒకనొక సమయంలో శని గ్రహ సంచారం ఉందని తెలుసుకున్నాడు. ఆ సమయం దగ్గర పడింది. శని భగవానుడు ప్రతి మనిషి జీవితంలో కనీసం కొన్ని ఘడియలు అయినా సంచారం చేస్తాడు. అది విధాత సృష్టి చేసేటప్పుడు శనితో ఒప్పందం అది. అలా ఆ పండితుడికి శని సమీపించే ఘడియలు వస్తున్నాయి.

ఇంట్లో వుంటే ఏదో ఒకటి జరిగి కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుంది. అది ఏ రూపంలో వుంటుందో ఏమో అని కుటుంబానికి దూరంగా ఒక నిర్మాన్యుష్య ప్రాంతంలో ఒక చెట్టు కింద మౌనంగా కూర్చోన్నాడు. ఆకలి వేస్తే తినడానికి కొంత భోజనం మూట తెచ్చుకున్నాడు. ఆమూటను చెట్టు కొమ్మకి తగిలించి.. ధ్యానంలో కూర్చోన్నాడు. మనిషికి కాలం అనుకూలించక పోయినప్పుడు మౌనంగా ధ్యానం దైవధ్యానం చేసుకోవాలి. సంపద ఐశ్వర్యం వున్నప్పుడు దానం చేసుకోవాలనేది పెద్దలు చెప్పివున్నారు కదా. అందుకే ఆ పండితుడు చెట్టు కింద ధ్యానంలో శని ప్రవేశించే ఘడియల కోసం చూస్తున్నాడు.

Shani Sancharam
Shani Sancharam

ఇంతలో ఆ దేశపు రాజ భటుల గుర్రాలు దౌడు తీస్తూ వస్తున్నాయి. ఇక్కడ చెట్టు కింద మనిషిని చెట్టు కొమ్మకి తగిలించిన సద్ది మూటను చూసి అరె ఇతనే వున్నట్లు వుంది. మన రాజా వారి నగలు దొంగతనం చేసిన మనిషి. దొంగతనం చేసి అడవిలోని ఇలాంటి నిర్మానుష్య ప్రాంతంలో దాక్కుని కుార్చోన్నాడు. ఆ చెట్టు కొమ్మకి తగిలించిన మూట బంగారు నగలు అయి వుంటాయి. చూడండి అనగానే భటులు మూట విప్పగానే భోజనం బదులు హారాలు, నగలు దగ దగమనే రత్నాలు వజ్రాలు కనపడ్డాయి. వెంటనే ఆ పండితుడ్ని బంధించి భటులు రాజస్థానానకి తీసుకుపోయి రాజు ముందు నిలబెట్టారు.

జరిగిందంతా చెప్పి మూట విప్పి చూశారు. అది సద్ది భోజనం. రాజు, భటులను మందలించాడు. ఏది నగలో భోజనం ముాట తెలియదా అని ప్రశ్నించాడు. లేదు మహారాజ.. మేము చూసినప్పుడు అవి అలానే ఉన్నాయని అన్నారు. అంతా మౌనంగా చూస్తున్న పండితుడు ” మహారాజా!! జరిగింది నేను చెపుతాను.. అని జరిగిన విషయం మెుత్తం చెప్పాడు….!! ఆ శని కొన్ని ఘడియలు అయినా మనల్ని పడుతుంది…అప్పుడు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు భ్రమ కలుగుతుంది. నాకు విషయం తెలిసే నేను మౌనంగా ద్యానం… చేసుకుంటున్నాను. ఆ శని వదిలిపోగానే నగల మూట భోజనం మూటగా మారింది..!!

శని ఆవహించినప్పుడు మనిషి సంయమనం సహనం ఓర్పు వహించాలి..!! ఆ సమయంలో మనం కొంచెం తొందర పడిన అది గొప్ప రాద్దాంతం అవుతుంది. తాడు పామవతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. కష్టాలు నిష్కారణంగా బాధిస్తాయి. మనం ఆ.. అన్నా అది పెద్ద తప్పుగా పరిగణించబడుతుంది. శని పట్టినప్పుడు.. ఆయన అన్ని గుణపాఠాలు నేర్పుతాడు. అనుభవం జీవితం చూపుతాడు. మనం న్యాయంగా.. ధర్మంగా వుంటే మనకు మంచి చేసి పోతాడు…!! అలా శని భగవానుడు సంచారం ప్రతి మనిషి జీవితాన్ని ఒక కుదుపు కుదుపుతుంది. అస్సలు శని సంచారం లేని మనిషి అంటూ ఎవరూ వుండరు. కనీసం కొన్ని ఘడియలు అయనా ఉండాల్సిందే.

Share this post with your friends