Sapthapadi Importance : సప్తపదిలో ఏడడుగులు దేనిని సూచిస్తాయి?

సప్తపది ఆచారం అనేది హిందూ వివాహ వేడుకలో ఒక కీలకమైన ఘట్టం. ఇందులో జంట పవిత్ర అగ్ని చుట్టూ ఈ ఏడు అడుగులు వేస్తారు. ఒక్కో అడుగుకు ఒక్కో అర్థం ఉంది. ఈ ఏడడుగులు జీవితాంతం బంధం బలంగా ఉండాలని ప్రమాణాలు, వాగ్దానాలను చేస్తారు. ప్రతి అడుగు ఒక నిర్దిష్ట వాగ్దానం లేదా నిబద్ధతకు నిదర్శనంగా చెబుతారు. తొలి అడుగు పోషణకు సంబంధించినది. దంపతులిద్దరూ ఒకరికొకు సాయం చేసుకుంటూ.. వారి ఇల్లు పోషణ, సమృద్ధితో నిండి ఉండేలా చూసుకుంటామనడానికి ఇది అర్థం. రెండవ అడుగు బలానికి సంబంధించినది. రెండవ అడుగులో శారీరక, మానసిక బలాన్ని పెంపొందించుకుంటామని చెబుతూ వేసుకునే అడుగు.

Sapthapadi Importance
Sapthapadi Importance

మూడవ అడుగు శ్రేయస్సుకు సంబంధించినది. ఈ మూడవ అడుగు.. సంపద, శ్రేయస్సు కోసం చేసే ప్రతిజ్ఞ. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి, వారి సంపద, వనరులను పంచుకోవడానికి కలిసి పనిచేస్తామని ఇచ్చే హామీ. నాలుగవ అడుగులో జంట ఒకరి కుటుంబాలకు మరొకరు మద్దతు ఇచ్చి.. శ్రద్ధ వహిస్తామని చేసే ప్రతిజ్ఞ. ఐదవ అడుగు సంతానానికి సంబధించినది. ప్రేమతో పాటు శ్రద్ధ కలిగిన తల్లిదండ్రులుగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆరవ అడుగు ఆరోగ్యం కోసం చేసే ప్రతిజ్ఞ. ఇది ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబధించినది. ఏడవ అడుగు స్నేహానికి సంబంధించినది. జీవితకాలం కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా.. స్నేహంగా ఉంటామని జంట చేసే ప్రతిజ్ఞ.

Share this post with your friends