భగవన్నామస్మరణ అంటేనే అశ్రద్ధ.. కానీ..

“నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే” అని శాస్త్రవాక్యం. అంటే.. భగవన్నామం స్మరించుకోవడంలో ఏ మాత్రం శ్రమ ఉండదు. కాని అది చాలా సులభం కావడం వల్ల దానిపై కొందరికి చిన్న చూపు, అశ్రద్ధ ఉంటుంది. యజ్ఞయగాదులు, దానధర్మాలు చేసినప్పటకీ తొలగని పాపం భగన్నామ స్మరణతోనే పోతుందా! అని అనుకుంటారు. శ్రద్ధగా, నియమబద్ధంగా చేసే భగన్నామ స్మరణ వల్ల ఎన్నో అద్భుతాలని ఆస్వాదించవచ్చు.

కొన్ని ప్రశ్నలకి సమాధానం సాధనే. సాధనతోనే సర్వేశ్వరుడి స్మరణలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలం. ఒక అమృతతుల్యమైన పదార్థాన్ని తిన్నాక దాని అనుభూతిని ఎదుటివారికి ఎంతకని చెప్పగలం! భగన్నామ స్మరణానుభవం కూడా అటువంటిదే. “యజ్ఞానాం జప యజ్ఞోస్మి” అని గీతలో జగద్గురువైన కృష్ణపరమాత్మే బోధించాడు. కాబట్టి భగవన్నామ స్మరణ చేస్తే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Share this post with your friends