Places To Visit In Rameswaram : రామేశ్వరంలో దర్శనీయ స్థలాలు ఏమేం ఉన్నాయంటే..

రామేశ్వర క్షేత్రం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు రామేశ్వరంలోని దర్శనీయ స్థలాల గురించి కూడా తెలుసుకుందాం. రామేశ్వరం ఒక ద్వీపమని తెలుసుకున్నాం కదా. దీనిని పంబన్ ద్వీపంగా పిలుస్తారు. ఇక్కడ భారత్, శ్రీలంకను వేరు చేసే పాక్ జలసంధి కూడా ఉంది. ఒకవైపు సముద్రం, మరోవైపు పచ్చని ప్రకృతి సోయగాల మధ్య రామేశ్వర క్షేత్రం ఉంటుంది. ఇది భక్తులకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. త్రేతాయుగంలో ఇక్కడే శ్రీరాముడు రామసేతును నిర్మించాడని చెబుతారు. అది ఇప్పటికీ సముద్ర గర్భంలో ఉందని చెబుతారు.

Places To Visit In Rameswaram
Places To Visit In Rameswaram

రామేశ్వర ద్వీపంలో చివరి ప్రదేశం ధనుష్కోటి. దీని దగ్గరకు వెళితే, ధనుష్కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు నిర్మించిన ఉన్న రామసేతు భాగాలు మనకు కనిపిస్తాయి. అలాగే ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు అబ్బుర పరిచే సహస్ర శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. మనల్ని మంత్ర ముగ్దుల్ని చేసే ఈ 108 శివలింగాలను మహర్షులు ప్రతిష్ఠించారని చెబుతారు. ఆలయ ప్రాంగణంలో అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఆసక్తికరంగా ఆ విగ్రహం శ్రీలంకవైపు చూస్తున్నట్లుగా ఉంటుంది. 1914లో బ్రిటిష్ వారు మండపం నుంచి రామేశ్వర ద్వీపం వరకూ రైలుమార్గాన్ని నిర్మించారు.

Share this post with your friends