Pancharama Kshetrams :పంచారామాలు ఎలా ఏర్పడ్డాయంటే..

హిందువుల ప్రధాన ఆరాధ్య దైవాలలో భోళా శంకరుడు ఒకడు. మహాశివుడు జ్యోతిర్లింగాలలో మాత్రమే కాకుండా పంచారామ క్షేత్రాలు సైతం ప్రసిద్ధి గాంచాయి. అసలు పంచారామాలు ఎలా ఏర్పడ్డాయనే దానికి కూడా ఒక కథ ఉంది. తారకాసురుడి కంఠంలో ఆత్మలింగం ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తారకాసుర సంహారం తరువాత అతడి కంఠంలోని ఆత్మలింగం ఐదు ప్రదేశాలలో పడిందని చెబుతారు. అవే పంచారామాలుగా పేర్కొంటారు. అలాంటి పంచారామాల్లో ఒకదాని గురించి తెలుసుకుందాం. అదే సామర్లకోట. ఇక్కడ లింగాన్ని సాక్షాత్తు కుమారస్వామి (సుబ్రహ్మణ్యస్వామి) ప్రతిష్టించాడని చెబుతారు.

Origins of Pancharama Kshetrams
Origins of Pancharama Kshetrams

అందువలన ఈ ప్రాంతం మొదట కుమారేశ్వరంగా మారింది. కాలక్రమేణా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆలయాన్ని చాళుక్య భీముడు 11వ శతాబ్దంలో నిర్మించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా ద్రాక్షారామంలోని భీమేశ్వరాన్ని సైతం చాళుక్య భీముడు నిర్మించాడు. అందుకే ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకే విధంగా ఉంటుంది. శైలి పరంగా ఒకేలా ఉంటుంది. అలాగే ఈ రెండు ఆలయాల నిర్మాణాలకు ఒకే రకం రాతిని వినియోగించడం జరిగింది. చాళుక్య భీముడు నిర్మించడం వల్ల ఇక్కడి స్వామివారు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. ఈ మందిర నిర్మాణం సామాన్య శకం 892లో ప్రారంభమై.. సుమారు 922 వరకు కొనసాగింది.

Share this post with your friends