గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవద్దు లేదా స్నానం చేయొద్దు అని పెద్దలు చెప్పడానికి లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంది. దేవాలయం అనేది శక్తి కేంద్రం. అక్కడ జరిగే పూజలు, మంత్రోచ్చారణల వల్ల సానుకూల దైవ శక్తి విస్తరిస్తుంది. దర్శనం సమయంలో ఆ శక్తి మన శరీరాన్ని, మన ఆరాను స్పర్శించి మనతో పాటు ఇంటికీ వస్తుంది. అదే సమయంలో నీళ్లతో కాళ్లు కడుక్కోవడం లేదా స్నానం చేయడం వల్ల ఆ దైవ శక్తిని మనమే తొలగించుకున్నట్లవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఇంటికి వచ్చాక కొద్ది సేపు ప్రశాంతంగా కూర్చొని… దర్శించిన దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయాలని సూచిస్తారు. ఇలా చేస్తే ఆలయం నుంచి వచ్చిన శక్తి మనలో స్థిరపడుతుంది. ఆ తరువాతే స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

