Narikela Deepam Benefits : నారికేళ దీపం ఎప్పుడు, ఎక్కడ వెలిగించాలి?

నారికేళ దీపం ఎలా వెలిగించాలనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ వెలిగించాలి? ఎప్పుడు వెలిగించాలనే విషయాను కూడా తెలుసుకుందాం. నారికేళ దీపాన్ని కార్తిక మాసంలో ఎప్పుడైనా వెలిగించవచ్చు. ముఖ్యంగా శివానుగ్రహం కోసం ఈ దీపాన్ని వెలిగిస్తున్నారు కాబట్టి పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన కార్తిక సోమవారాల్లో నారికేళ దీపం వెలిగిస్తే చాలా మంచిదట. అలా వీలుపడని వారు కార్తిక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు. అలాగే ఇతర మసాల్లోనూ శనివారం నాడు వెలిగిస్తే మంచిది. ముఖ్యంగా నారికేళ దీపాన్ని సంధ్యా సమయంలో వెలిగిస్తే శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

 Narikela Deepam Benefits : నారికేళ దీపం ఎప్పుడు, ఎక్కడ వెలిగించాలి?
Narikela Deepam Benefits : నారికేళ దీపం ఎప్పుడు, ఎక్కడ వెలిగించాలి?

ఇక నారికేళ దీపం ఎక్కడ వెలిగించాలో తెలుసుకుందాం. ఐశ్వర్య ప్రాప్తి కోసం నారికేళ దీపాన్ని వెలిగిస్తారు. దీనిని శివాలయంలో కానీ, ఇంటి పూజామందిరంలో కానీ.. తులసి కోట వద్ద కూడా వెలిగించవచ్చు. ముఖ్యంగా కార్తిక మాసంలో నారికేళ దీపాన్ని వెలిగిస్తే పరమేశ్వరుని కటాక్షం లభిస్తుందట. ధన లాభం కోసం ఈ దీపాన్ని వెలిగిస్తారు. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు కావచ్చు.. లేదంటే జాతక దోషాల వంటివి ఏమున్నా కూడా నారికేళ దీపాన్ని వెలిగిస్తారు. అలా వెలిగిస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లోని వారంతా సుఖశాంతులతో జీవిస్తారట. అలాగే సకల కోరికలూ నెరవేరుతాయట.

Share this post with your friends