Moon Dreams and Superstitions : కలలో చంద్రుడు కనిపిస్తే… వైవాహిక బంధానికి అవరోధం ఏర్పడుతుందా?

కలలో చంద్రుడు కనిపిస్తే వైవాహిక బంధానికి అవరోధమా? స్వప్న శాస్త్రం ప్రకారం సమాధానం స్పష్టంగా ఉంటుంది. చంద్రుడు సాధారణంగా మనస్సు, శాంతి, సంబంధాల ప్రతీక. కాబట్టి పౌర్ణమి చంద్రుడు కలలో కనిపిస్తే అది అత్యంత శుభసూచకం. దాంపత్య జీవితంలో ఆనందం, అపార్థాల నివృతి, కుటుంబంలో ఐక్యత పెరుగుతాయని చెబుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందే సూచనగా కూడా దీన్ని చెబుతారు. నెలవంక కనిపిస్తే ఉపాధి, వ్యాపారంలో పురోగతి సూచనగా చెబుతారు. అయితే మేఘాల వెనుక దాగిన చంద్రుడు కనిపిస్తే లక్ష్యసాధనలో తాత్కాలిక అడ్డంకులు ఉన్నట్టు అర్థం. కానీ, అది అవరోధం కాదు, జాగ్రత్తగా ముందుకు వెళ్లాలనే హెచ్చరిక మాత్రమే. ఎర్రటి చంద్రుడు లేదా చంద్రుడు విరిగినట్లుగా కలలో కనిపిస్తే ….. మానసిక ఆందోళన, కుటుంబంలో విభేదాల సూచనగా పరిగణిస్తారు. అటువంటి సమయంలో ప్రశాంతంగా ఉండటం, మాటల్లో సంయమనం పాటించడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే, చంద్రుడు కలలో కనిపించడం శుభప్రదమే. భయపడాల్సిన అవసరం లేదు. మన ఆలోచనలు, మన ప్రవర్తనే నిజమైన భవిష్యత్తును నిర్మిస్తాయి.

Moon Dreams and Superstitions
Moon Dreams and Superstitions
Share this post with your friends