నందీశ్వరుడు కొమ్ములు లేకుండా ఉండే క్షేత్రం ఎక్కడుందంటే..

పరమేశ్వరుడికి అత్యంత ప్రియమైన భక్తుడు నందీశ్వరుడు. శిలాదుని కుమారుడే ఈ నందీశ్వరుడు. పుట్టుకతోనే శివుడి పట్ల అత్యంత భక్తిశ్రద్ధలతో ఉండేవాడు. అందుకే శివుడు కూడా తను ఎక్కడ ఉంటే.. అక్కడ తనకు ఎదురుగా ఉండేలా నందీశ్వరుడికి వరమిచ్చాడు. అందుకే ప్రతీ శివాలయంలోనూ శివుడికి ఎదురుగా నంది ఉంటాడు. ఎక్కడైనా నందీశ్వరుడు శిలా రూపంలోనే ఉంటాడు. అనుక్షణం స్వామివారిని పర్యవేక్షిస్తూ రక్షణగా ఉంటాడు. కొన్ని ఆలయాలు నందీశ్వరుడి మహిమలకు తార్కాణాలు. అలాంటి ఓ అద్భుత ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నందీశ్వరుడు కొమ్ములు లేకుండా ఉండే క్షేత్రం ఎక్కడుందంటే..
నందీశ్వరుడు కొమ్ములు లేకుండా ఉండే క్షేత్రం ఎక్కడుందంటే..

మహాశివుని ఎదుట ఉండే నందీశ్వరుడిని ధర్మ స్వరూపంగా పూజిస్తారు. నంది నాలుగు పాదాలను నాలుగు వేదాలకు ప్రతీకగా చెబుతారు. అయితే నంది ముందర ఒక పాదం లేచి ఉంటుంది. దీనికి కారణం కలియుగంలో ధర్మం ఒంటిపాదంపై నడుస్తుందనడానికి నిదర్శనమేనట. మిగిలిన మూడు పాదాలు లోపలకు మడిచి.. శివాలయానికి రక్షణ కవచంగా ఉంటాయట. అయితే గుంటూరు జిల్లాలోని నందివెలుగులో నందీశ్వరుడికి కొమ్ములు ఉండవు. ఇది అత్యంత ప్రాచీనమైన దేవాలయం. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు దొంగలను తరిమికొట్టే క్రమంలో తన కొమ్ములను కోల్పోయాడట. దేశంలో ఇంతటి అరుదైన క్షేత్రం ఇదేనట.

Share this post with your friends