
బ్రాహ్మణుడిని అడిగి బాల కృష్ణుడు ఎలా ఉంటాడో దొంగ తెలుసుకున్నాడు. ఆ తరువాత కన్నయ్య కోసం కాపు కాశాడు. ఇంతలోనే తొలుత పిల్లనగ్రోవి వినిపించింది. ఆ వెంటనే ఇద్దరు పిల్లలు వస్తుండటాన్ని దొంగ చూశాడు. బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ల వెంట నీళ్లు కారడం ఆరంభమైంది. ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని, బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు ఆ దొంగ.
ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు.. కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని.. ‘నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?’ అంటూ బాధపడ్డాడు. అప్ప్పుడు కన్నయ్య.. ” నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు కానీ ఈ దొంగ నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం , సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను” అని చెప్పాడు. ఇది విన్న ఆ దొంగ.. ఒకరకంగా చెప్పాలంటే.. శ్రీ కృష్ణుని అనుగ్రహాన్ని పొందిన ఆ మహాత్ముడు చలించిపోయి కన్నీటితో కృష్ణుని కాళ్ళ మీద పడి ” హే పరందామా , ఆశ్రిత పారిజాతా , పురుషోత్తమా , నాకు నీ దర్శన భాగ్యం కలగడానికి కారణం ఈ బ్రహ్మణోత్తముడు చెబుతున్న నీ ప్రవచనం వినడమే కదా, కనుక నీవు ఈతనికి కూడా నీ దర్శన భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి ” అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు ఈ దొంగ మాటలకు కరిగిపోయి ఆ బ్రాహ్మణుని పరివర్తన కలిగిన భక్తికి మెచ్చి తన దర్శన భాగ్యం కలిగించాడు. పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి.
