Lord Ganesha’s Rarest Idol : తండ్రిని అనుమతి కోరి కుంభకోణం ప్రాంతానికి వచ్చిన వినాయక

తమిళనాడులోని కుంభకోణం బస్టాండ్ నుంచి 8 కిలో మీటర్ల దూరంలో కొలువైన శ్వేత వినాయక ఆలయం గురించి ఎన్నో విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం కదా.
వినాయకుడిని పూజించిన తరువాత క్షీర సాగర మధనం నిర్విఘ్నంగా కొనసాగి అమృతం బయటకు వచ్చింది. ఆ తరువాత నురుగ వినాయకుడిని ఇంద్రుడు స్వర్గానికి తీసుకెళ్లాడని తెలుసుకున్నాం కదా. అహల్య ఘటన తర్వాత శాప విమోచనం కోసం ఇంద్రుడు వినాయకుడిని తీసుకొచ్చి భూమిపై పలు ప్రదేశాల్లో ఉంచి పూజించాడు. ఈ క్రమంలోనే శ్వేత వినాయకుడిని కుంభకోణం ప్రాంతానికి ఇంద్రుడు తీసుకొచ్చాడు.

Lord Ganesha's Rarest Idol : తండ్రిని అనుమతి కోరి కుంభకోణం ప్రాంతానికి వచ్చిన వినాయక
Lord Ganesha’s Rarest Idol : తండ్రిని అనుమతి కోరి కుంభకోణం ప్రాంతానికి వచ్చిన వినాయక

అప్పుడు వినాయకుడు ఈ ప్రాంతాన్ని చూసి ముగ్దుడయ్యాడట. ఇందుకోసం తన తండ్రి పరమేశ్వరుడిని కోరి ఒక్క చిన్న పిల్లాడి రూపంలో పవిత్రతకు, వాతావరణానికి ముగ్దుడై ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుకొంటాడు. ఇందుకోసం తన తండ్రి పరమశివుడి సహాయాన్ని కోరుతాడు. దీంతో శివుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో అక్కడికి వస్తాడు. అదే సమయంలో ఇంద్రుడికి శివార్చనకు సమయం ఆసన్నమవడంతో తనకు పిల్లవాడి రూపంలో ఉన్న వినాయకుడికే శ్వేత వినాయకుడిని ఇచ్చి శివార్చనకు వెళతాడు. శివార్చన ముగిసే వరకూ విగ్రహాన్ని కింద పెట్టవద్దని చెప్పగా.. తనకు ఆ ప్రాంతం నచ్చడంతో వినాయకుడు తన చేతిలోని శ్వేత వినాయకుడిని బలిపీఠం కింద పెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends