Lord Ganapati Temple Kumbhakonam : పాల సముద్రం నురగతో దేవతలు శ్వేత వినాయకుడిని తయారుచేశారట..

తమిళనాడులోని కుంభకోణం బస్టాండ్ నుంచి 8 కిలో మీటర్ల దూరంలో కొలువైన శ్వేత వినాయక ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం. దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం గావించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో సాగమథనం గావించిన వెంటనే అమృతం రాలేదు. చాలా అడ్డంకులు వచ్చాయి. అమృతం కన్నా ముందుగా హాలాహలం రావడంతో దానిని పరమేశ్వరుడు తన గరళంలో దాచి లోక రక్షణ గావించాడు. అయితే అసలు ఎందుకు ఇలా జరిగిందా? అని ఆలోచించిన దేవతలు అసలు విషయం గ్రహించారట.

Lord Ganapati Temple Kumbhakonam : పాల సముద్రం నురగతో దేవతలు శ్వేత వినాయకుడిని తయారుచేశారట..
Lord Ganapati Temple Kumbhakonam : పాల సముద్రం నురగతో దేవతలు శ్వేత వినాయకుడిని తయారుచేశారట..

అదేంటంటే.. క్షీరసాగర మథనానికి ముందు విఘ్నాధిపతి అయిన గణపతిని పూజించకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు వచ్చాయని దేవతలకు నారద మహర్షి చెప్పాడట. అప్పుడు తాము చేసిన తప్పును గ్రహించిన దేవతలు, రాక్షసులు శివయ్యను తరుణోపాయం కోరారట. అప్పుడు పరమశివుడి సూచన మేరకు వెంటనే పాల సముద్రం నుంచి నురగను తీసి దానితో ఒక గణేశుడిని తయారు చేసి పూజించి అమృతాన్ని సాధించారట. అప్పుడు ఇంద్రుడు పాల నురుగతో తయారైన వినాయకుడి విగ్రహాన్ని స్వర్గానికి తీసుకెళ్లి పూజించేవాడట. అయితే కొంతకాలం తర్వాత అహల్య కారణంగా తనకు తగిలిన శాప నివృత్తి కోసం ఆ వినాయక విగ్రహాన్ని భూమిపైకి తీసుకొచ్చి పలు ప్రాంతాల్లో ఉంచి పూజలు నిర్వహించాడట.

Share this post with your friends