అయ్యప్ప స్వాములకు ఏడాదికో పేరు చొప్పున 18 పేర్లు.. అవేంటంటే..

కార్తీక మాసంలో పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలను ధరిస్తారన్న విషయం తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం ఎక్కడ చూసినా అయ్యప్ప భక్తులే కనిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద మొత్తంలో దర్శనమిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్వాములు ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు పయనం అవుతున్నారు. తెల్లవారుజామున నిద్ర లేచి చల్లని నీటితో స్నానమాచరిస్తారు. నిత్యం కఠిన దీక్షను నిర్వహిస్తారు. 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధారణ కొనసాగిస్తారు. 40 రోజుల దీక్షతో మండల దీక్షను పూర్తి చేసుకుంటారు. అనంతరం అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల చేరుకుంటారు.

అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములకు వివిధ పేర్లు ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. అయ్యప్ప ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు మాలధారణ చేసేవారిని గురు స్వామి అంటారు. ప్రతి సంవత్సరం మాల వేసుకునే వారిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరములకు.. 18 పేర్లున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మొదటి సారి దీక్ష తీసుకునే స్వామి కన్నెస్వామి
రెండోసారి మాల ధారణ చేస్తే కత్తిస్వామి
మూడోసారి మాల వేస్తే గంట స్వామి
నాలుగోసారి మాల వేసుకుంటే గద స్వామి
ఐదవ సారి మాల వేస్తే విల్లు స్వామి
ఆరవసారి మాల వేస్తే జ్యోతి స్వామి
ఏడవసారి మాల వేస్తే సూర్య స్వామి
ఎనిమిదవసారి మాల వేస్తే చంద్ర స్వామి
తొమ్మిదవసారి మాల వేసుకుంటే వేలు స్వామి
పదవసారి మాల వేస్తే విష్ణు చక్ర స్వామి.
11వ సారి మాల వేస్తే శంఖాధార
12వ సారి మాల వేస్తే నాగాభరణ స్వామి
13వ సారి మాల వేస్తే శ్రీహరి స్వామి
14వ సారి స్వామి మాల వేస్తే పద్మ స్వామి
15వ సారి మాల ధరిస్తే త్రిశూల స్వామి.
16వ సారి మాల ధరిస్తే శబరిగిరిస్వామి
17వ సారి మాల వేస్తే ఓంకార స్వామి
18వ సారి మాల వేస్తే నారికేళ స్వామి అని అంటారు.

Share this post with your friends