Koti Deepotsavam : ఇంతమంది ప్రజలు ఈ కోటిదీపోత్సవంలో భాగస్వాములు కావడం ప్రశంసనీయం

కోటిడీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచన టెలివిజన్ ప్రై. లిమిటెడ్ యాజమానులు శ్రీనరేంద్రచౌదరి. శ్రీమతి రమాదేవి, శ్రీమతి రచన చౌదరిలకు… శాంతియుతులై ఈ ప్రాంగణంలో నెలకొన్న భక్తులకు అభినందనలు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల నాకు ఆనందం అనుభవంలోకి వస్తోంది. ఇంతమంది ప్రజలు ఈ కోటిదీపోత్సవంలో భాగస్వాములు కావడం ప్రశంసనీయం. మనదేశంలో ఏ కార్యక్రమాన్నైనా దీపాన్ని వెలిగించడంతో శుభారంభం చేస్తారు. దీపం వెలిగించడం అనేది మనకు అందకారం నుంచి వెలుగువైపుకి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడవడం అనే సందేశాన్నిస్తోంది.

President Murmu participates in Koti Deepotsavam
President Murmu participates in Koti Deepotsavam

కార్తిక దీపోత్సవాలలో శివ భగవానుని ఆరాధిస్తుంటారు. కార్తిక దీప పరంపర, సంప్రదాయం చాలా ప్రాచీనకాలం నుంచి వస్తున్నది. ఈ పవిత్రపరంపర సత్యానికి, జ్ఞానానికి చెందిన పరంపర. కార్తిక దీపం అసత్యంపై సత్యం గెలవడానికి ప్రతీక.

ఈ పావన దీపోత్సవం తెలుగు సంస్కృతి విస్తరిల్లిన ఈ ఆధ్యాత్మిక భూమిపై నిర్వహించుకుంటున్నాం. ఇది మరింత ఆనందదాయకం. ఎక్కువ సంఖ్యలో దీపాలను వెలిగించడం ద్వారా తెలుగు సంస్కృతి కూడా వెలుగుతుందని… దేశానికి జాగృతిని, అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను. ఈ ఉత్సవం వల్ల అందరి హృదయాలలో కొత్త ఉత్సాహానికి, కొత్త ఆశలు చిగురులు వేయడానికి అవకాశం ఉంటుంది.
అందరూ ఒక్కచోట కూడి, ఒకేసారి దీపాలను వెలిగించడం వల్ల ఏకత, సమైక్యతా భావనలు కూడా ప్రకాశిస్తాయి. దేశవాసుల మధ్య ఇటువంటి ఉత్సవాలు సమైక్యతా స్ఫూర్తిని కలిగిస్తాయి. నేడు మనదేశం సంపూర్ణ వికాసము, అందరినీ కలుపుకుని ప్రగతిబాటలో ముందడుగు వేయడం అనే లక్ష్యంతో సాగిపోతోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు దేశ ప్రజలందరూ ఒక్కటై కదిలి రావాలి. వికసిత భారత నిర్మాణంలో ప్రతివారూ పాలుపంచుకోవాలి. నాకు విశ్వాసం ఉంది… ఆధునికతను అనుసరించడంతో పాటుగా, మన సంస్కృతిపై గౌరవము. దానిని పరిరక్షించడం మన బాధ్యత. ప్రసార మాధ్యమాలు ఈ బాధ్యతను నెరవేర్చాలి.
నేడు మనందరం కలిసి మన మనస్సులలో సంకల్పమనే దీపాన్ని వెలిగిద్దాం రండి. నిరంతరాయంగా దేశం వికాసమనే మార్గంలో పయనించాలనే సంకల్పం చేద్దాం. సత్యం, ధర్మాన్ని అనుసరించాలనే సంకల్పం. పౌరులందరికీ శుభాలు కలగాలని చెబుతూ సంకల్పదీపం వెలిగిద్దాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారందరికీ నేను శుభాభినందనలు తెలియచేస్తున్నాను. అందరికీ ఉజ్జ్వల భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
– శ్రీమతి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి

శ్రీమద్భాగవతం, శివపురాణం మరియు ఇతర పురాణాల సారం, కార్తిక మాసపు మాహాత్మ్యాన్ని నలుదిశలా వ్యాపింపజేసే దివ్య సంకల్పంతో, భక్తి టీవీ మరియు ఎన్టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం – 2025’ మహోత్సవానికి సకల భక్తజనులందరికీ హృదయపూర్వక ఆహ్వానం.
కార్యక్రమ వివరాలు : నవంబర్ 1వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు.ప్రతిరోజూ సాయంత్రం 5:30 గంటల నుండి ఎన్టీఆర్ స్టేడియం, హైదరాబాద్.

Share this post with your friends