కాలభైరవునికి బ్రహ్మ హత్యా దోషం.. అప్పుడు శివుడేం చెప్పాడంటే..

బ్రహ్మ దేవుడు, విష్ణుమూర్తికి మధ్య తాను గొప్పంటే తాను గొప్పంటూ వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మ దేవుడు వేదాలను ఎవరో గొప్పో చెప్పమంటే నాలుగు వేదాలు శివుడు గొప్పని తేల్చేశాయి. వేదాలు చెప్పినది విన్న తర్వాత బ్రహ్మకు కోపం వచ్చింది. మీ మాటలు మీ అజ్ఞానానికి నిదర్శనమంటూ వేదాలను తూలనాడాడు. శివుడు ఎప్పుడూ తన శరీరంపై భస్మంతో.. తలపై శిగ, మెడలో రుద్రాక్షలు, పాములను ధరిస్తాడంటూ శివుడిని సైతం నిందించాడు. ఇదంతా విన్న శివుడికి పట్టరాని కోపం వచ్చి కాల భైరవుడిలా మారి బ్రహ్మను సంహరించాడు.

బ్రహ్మను సంహరించడంతో కాల భైరవుడుకి బ్రహ్మ హత్యా దోషం చుట్టుకుంది. దాని నుంచి ఎలా బయటపడాలని శివుడిని కాలభైరవుడు అడగ్గా.. అప్పుడు శివుడు అన్ని తీర్థ స్థలాలను సందర్శించమని సూచించాడు. ఆ వెంటనే కాలభైరవుడు భూమిపై ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ కాశీకి చేరుకున్నాడు. అప్పుడు కాల భైరవుడి చేతికున్న బ్రహ్మ కపాలం మాయమైంది. దీంతో కాలభైరవుడు.. బ్రహ్మ హత్యా దోషం నుంచి నివారణ పొందాడు. శక్తిసంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజుని కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. కాలభైరవుని ఆలయం లేకుండా శివాలయాల్లోనే పూజాభిషేకాలు జరుపుతారు.

Share this post with your friends