ప్రపంచంలో దేవుని కంటే గొప్పది ఏదైనా ఉందా?

యక్ష ప్రశ్నల గురించి తెలిసే ఉంటుంది. ధర్మరాజును యక్షుడు అడిగిన ప్రశ్నలనే యక్ష ప్రశ్నలని అంటారు. ప్రపంచంలో దేవుని కంటే గొప్పది ఏమిటి? అంటే దానికి సమాధానం ప్రపంచంలో దేవుడి కంటే గొప్పది ధర్మం. ఇది ఉన్న చోట ప్రపంచమంతా శాంతి నెలకొని ఉంటుంది. శాంతి ఉన్న చోట జీవితం వికసిస్తుంది. ధర్మం లేకపోతే లోకం నిలవదు. అందుకే దేవుడి కంటే కూడా ధర్మం అత్యున్నతమైన శక్తిగా పేర్కొంటారు.

మనిషికి అత్యంత పెద్ద శత్రువు ఎవరు? అంటే.. కోపమే పెద్ద శత్రువు ఎందుకంటే కోపం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు. చిన్న విషయాలు పెద్దవిగా మారతాయి. మనసు కలత చెందుతుంది. చివరికి మనల్ని మనమే నష్టపరచుకుంటాం. యక్ష ప్రశ్నల్లో మూడవది.. ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది ఏమిటి?

ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది మనసే. ఎందుకంటే క్షణంలోనే ప్రపంచాన్ని చుట్టేయగల సత్తా మనసుకు ఉంది. ఆలోచనలు విశ్వాన్ని చుట్టొచ్చు. దాన్ని నియంత్రించడం కష్టం. మనసు శక్తి అపారమైనది.

Share this post with your friends