తుమ్ము మంచిది కాదా? మనం బయటకు వెళుతుంటే తుమ్మితే ఆగిపోవాలా?

శుభకార్యాల వేళ, ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో తుమ్మితే అశుభం కలుగుతుందని అంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళుతున్న తరుణంలో ఎవరైనా తుమ్మితే ఒక్క క్షణం కూర్చొని.. మంచినీళ్లు తాగి తిరిగి వెళతారు. వాస్తవానికి ఇది నమ్మకమా? శాస్త్ర సమ్మతమా? అనేది తెలుసుకుందాం. తుమ్ములు అశుభ సంకేతమేమీ కాదట. కేవలం అది మన మనసులోని బలహీనత మాత్రమేనని చెబుతారు. తుమ్మినవారు ఒక్క క్షణం పాటు రెస్ట్ తీసుకోవాలని సైన్స్ చెబుతోంది. ఎందుకంటే తుమ్మిన సమయంలో మనిషి శరీరం క్షణ కాలం పాటు స్తంభిస్తుందట. అయితే అది ఎదుటి వారికి ఏమాత్రం అశుభం కాదని చెబుతారు.

 

తుమ్ము మంచిది కాదా? మనం బయటకు వెళుతుంటే తుమ్మితే ఆగిపోవాలా?
తుమ్ము మంచిది కాదా? మనం బయటకు వెళుతుంటే తుమ్మితే ఆగిపోవాలా?

 

శరీర వ్యవస్థలో వచ్చే మార్పుల వల్లనో, వాతావరణ ప్రభావం చేతనో, ఆహారంలో మార్పు కారణంగానో సాధారణంగా ఎవరికైనా తుమ్ములు వస్తాయి. అవి ఫలానా సమయంలోనే రావాలనే రూల్ ఏమీ లేవు. శరీర ధర్మాలు తప్పవు. ఆ తుమ్ములకూ, మనకు వచ్చే శుభాశుభాలకూ ఏమాత్రం సంబంధం లేదని శాస్త్రం చెబుతోంది. ఎక్కడో ఎవరికో అలా ఒకసారి తుమ్మినప్పుడు అనుకున్న పని విఫలం కావడమో.. లేదంటే ఏదైనా నష్టం సంభవించడమో జరిగి ఉండవచ్చు. అలా జరగాలని ఉంటే ఏం చేసినా జరుగుతుంది. కానీ అది కాస్తా సమాజంలో అది ప్రచారమై ఉండవచ్చు. అంతేకాని, ఈ తుమ్ములకూ, మనకు జరిగే వాటికీ కార్యకారణ సంబంధం ఎంత మాత్రమూ లేదని.. ఇది కేవలం మూఢనమ్మకమేనని పండితులు సైతం చెబుతున్నారు.

Share this post with your friends