Importance Of Pushya Masam : పుష్యమాసం విశిష్టత ఇదే… ఈ మాసంలో వేటిని దానంగా ఇవ్వాలంటే

పుష్యమాసం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. శనిభగవానునికి జన్మ నక్షత్రం పుష్యమి కావడంతో ఈ మాసం ఆయనకు అత్యంత ప్రీతికరం. హేమంత ఋతువులో వచ్చే ఈ కాలం జపతపాలు, ధ్యానం, దానధర్మాలకు అనుకూలమని శాస్త్రాలు చెబుతాయి. ‘పుష్య’ అంటే పోషణ అనే అర్థం ఉండటంతో ఈ మాసంలో పంటలు సమృద్ధిగా లభిస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ, షట్టిల ఏకాదశి, చొల్లంగి అమావాస్య వంటి పండుగలు ఈ మాసానికే ప్రత్యేకం. పితృదేవతారాధన, విష్ణు–సూర్య పూజలకు ఇది శ్రేష్ఠమైన కాలం. ముఖ్యంగా నువ్వులు, వస్త్రాలు, దుప్పట్లు వంటి దానాలు చేస్తే శని దోషాలు తొలగి అఖండ పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

Importance Of Pushya Masam : పుష్యమాసం విశిష్టత ఇదే... ఈ మాసంలో వేటిని దానంగా ఇవ్వాలంటే
Importance Of Pushya Masam : పుష్యమాసం విశిష్టత ఇదే… ఈ మాసంలో వేటిని దానంగా ఇవ్వాలంటే
Share this post with your friends