కదంబ చెట్టులో ఎన్ని వైద్య గుణాలున్నాయో తెలిస్తే..

కదంబ చెట్టు పువ్వుల గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఈ పువ్వులను పూజలకు సైతం వాడుతుంటారు. ఈ చెట్టుకు ఆలయాల్లో అయితే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పవిత్రంగా భావించి ఈ చెట్టును పూజిస్తారు. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఈ చెట్టుకు ఆయుర్వేద పరంగా కూడా మంచి ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు బెరడు నుంచి ఆకులు, పువ్వులు, వేర్లు ప్రతిదీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్‌ను తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. కదంబ ఆకులు, వేర్లు, బెరడు నుంచి తీసిన రసాలను షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.

అలాగే కదంబ ఆకుల కషాయాలను మనకు తగిలిన గాయాలపై రాస్తే అవి త్వరగా తగ్గిపోతాయి. అలాగే ఏమైనా వాపులు ఉన్న చోట కదంబ ఆకులను నూరి కడితే వాపుతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. కదంబంలో ఉండే పదార్థాలు హానికరమైన సూక్ష్మజీవులను అడ్డుకుని చర్మ వ్యాధుల నివారణకు కదంబ పేస్టును వాడతారు. కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ ఈ కదంబ పేస్ట్ ఉపయోగపడుతుంది. కదంబలోని ఔషధ గుణాలు పేగు పురుగులను సంహరిస్తాయి. ఈ చెట్టు తేమ ఎక్కువగా ఉండే.. సారవంతమైన ప్రదేశాల్లో వేగంగా పెరుగుతుంది. ఈ చెట్టుకు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. ఈ చెట్టు సుమారు 45 మీటర్ల ఎత్తు పెరిగి.. దాదాపు ఐదేళ్లలో పువ్వులు పూస్తుంది.

Share this post with your friends