గంగా జలాన్ని ఇంటికి తెస్తే పాటించాల్సిన విధి విధానాలేంటంటే..

కాశీకి వెళ్లినప్పుడో మరో ప్రదేశానికి వెళ్లినప్పుడో మనం గంగాజలం తీసుకొచ్చుకుంటాం. పవిత్ర గంగాజలాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మంచిదని తప్పక తీసుకొస్తాం. అయితే ఇలా చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. గంగా జలాన్ని ఎలా పడితే అలా ఉపయోగించుకోకూడదు. గంగా జలాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించాలి. అదెలాగో తెలుసుకుందాం. గంగా జలాన్ని మనం బాటిల్‌లో తెచ్చుకుంటాం. అయితే తీసుకొచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ డబ్బాలో గంగా జలాన్ని పెట్టకూడదట.

ఇంటికి తీసుకుని రాగానే బాటిల్‌లోని గంగా జలాన్ని ఇత్తడి, కంచు, రాగి వంటి పాత్రల్లో పోసి మాత్రమే నిల్వ చేయాలి. ఇక ఆ తరువాత గంగాజలం ఉన్న పాత్రను కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి. శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే గంగాజలాన్ని తాకాలట. ఇంటిని శుభ్రం చేసుకున్నాక గంగా జలాన్ని ఇల్లంతా చల్లాలి. ఇలా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుందట. ఇక చివరిగా ఇంట ఆర్థిక సమస్యలు ఉన్నవారు.. అవి పోవాలనుకుంటే గంగాజలం ఉన్న పాత్రను ఇంటి ఉత్తరం భాగంలో పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయట.

Share this post with your friends