పరమాత్మను ఎలా ఆరాధించాలి?

పరమాత్మను మనం శబ్దరూపంలో ఆరాధించుకోవాలి. మౌనం సాధ్యం కాకపోతే శబ్దాన్ని ఆరాధించాలి. నిశ్శబ్దం నుంచి శబ్దం పుట్టింది కాబట్టి, ఆ శబ్దమే పరమాత్మ స్వరూపం. అదే శబ్దం “ఓం”. నామ–రూపం ఎలా ఏర్పడ్డాయంటే.. పరమాత్మ లక్షణాల నుంచి ఏర్పడ్డాయట.

పరమాత్మ లక్షణాలు:

1. అస్తి – ఆయన ఉన్నారు.
2. భాతి – ఆయన ప్రకాశిస్తున్నారు.
3. ప్రియము – ఆయనకు భక్తులపై అనంతమైన ప్రేమ.

భక్తుడు ఆ ప్రేమను అనుభవించడానికి తనకు ఇష్టమైన రూపాన్ని కల్పించాడు. ఆ రూపానికి ఒక నామం ఇచ్చాడు. అందుకే అవ్యక్తుడైన పరమాత్మ, వ్యక్తమై రూప–నామాలతో ఆరాధనకు వచ్చాడు. ఈ జగత్తు అంతా పరమాత్మ నుంచి పుట్టింది. తల్లిగర్భం నుంచి బిడ్డ వచ్చినట్లే.. తల్లికి బిడ్డపై ఉన్న అవ్యాజ ప్రేమ లాగానే, పరమాత్మకు తన సృష్టిపై అవ్యాజమైన కరుణ ఉంది. రూపంలేని పరమాత్మ మనకోసం రూపం తీసుకున్నారు. అందుకే ఆయనని మౌనంలో ఆరాధించాలి. అది కుదరకపోతే. దీపం ద్వారానో… కుదరకపోతే జపం ద్వారానో.. నిరంతర భక్తితో రమించాలి.

Share this post with your friends